ఆ సాక్ష్యాలు చాలవు:పాక్

అంతేగాక భారత్ సాక్ష్యాలు సరిపోవని ఒకటి రెండురోజుల్లో పాక్ ప్రకటించనుందని పత్రికలు పేర్కొన్నాయి. ముంబయి పేలుళ్ల నిందితులు పాక్‌కు చెందినవారని వారిని తమకు అప్పగించాలని కోరుతూ భారత్ అందజేసిన సాక్ష్యాలను పాక్ తిరస్కరించింది. ముంబయి పేలుళ్లలో పాక్ పాత్రపై భారత్ అందజేసిన సాక్ష్యాలను తిరస్కరించాలని నిర్ణయించిన పాక్ ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాల్లో భారత్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఓ నివేదికను సిద్ధం చేస్తున్నారు. భారత్ సాక్ష్యాలను తిరస్కరిస్తూ తలమ ఆరోపణలు, అందుకు కారణాలపై ఓ నివేదిక తయారుచేసి భారత్‌కు పంపనున్నట్లు పాక్ మీడియా వార్తలు వెల్లడిస్తున్నాయి.












Click it and Unblock the Notifications