సత్యంలో కీలక పత్రాలు లభ్యం
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ ఆర్థిక అవకతవకలపై అన్ని ప్రభుత్వసంస్థలు, ఆర్థికవిభాగాలు విచారణలు మొదలెట్టాయి. సత్యం సంస్థ లోగుట్టును తెలుసుకోవడానికి ఆర్థిక నేరాల ప్రత్యేక విభాగం ప్రత్యేక జడ్జి అనుమతితో కంపెనీల రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు సంస్థలోని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ డైరక్టర్ల బోర్డు రద్దు చేసిన ప్రభుత్వం తదుపరి చర్యల నిమిత్తం కంపెనీ లా బోర్డును సంప్రదించగా, బోర్డు డైరక్టర్లు, ఆడిటర్లు ఈ నెల 20 లోగా సమస్యపై వివరణ ఇవ్వాలని లా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వారంరోజుల్లోగా సత్యం కంపెనీకి నియమించే డైరక్టర్ల బోర్డు తాత్కాలికమేనని లా బోర్డు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications