సత్యం సంక్షోభ నివారణే లక్ష్యం:అచ్యుతన్
న్యూఢిల్లీ:సత్యం సంస్థలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని నివారించటం, సంస్థను తిరిగి యధాస్ధానానికి తీసుకురావటమే తమ ప్రధాన లక్ష్యమని సెబీ మాజీ సభ్యుడు, బోర్డుకు కొత్తగా ఎంపికైన సభ్యుడు సి.అచ్యుతన్ తెలిపారు. పడిపోయిన సంస్థ ప్రతిష్ఠను ఎలా నిలబెట్టాలనే విషయంపై బోర్డు ప్రథమ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. అలాగే ఇంతటి సంక్షోభానికి కారకులు తప్పకుండా మూల్యం చెల్లిస్తారని అచ్యుతన్ అన్నారు.












Click it and Unblock the Notifications