నగరానికి చేరిన అక్షయ్ మృతదేహం
హైదరాబాద్: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన అక్షయ్ విశాల్ మృతదేహం ఈరోజు ఉదయం నగరానికి చేరింది. అక్కడినుంచి బేగంపేటలోని ఆయన స్వగృహానికి మృతదేహాన్ని తరలించారు. ఈనెల 15న అమెరికాలో సూపర్‌మార్కెట్‌కు వెళ్లి వస్తున్న ఆయనను డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు నీగ్రోలు కాల్చి చంపారు. అప్పటినుంచి ఆయన కుటుంబసభ్యుల శోకం వర్ణనాతీతంగా ఉంది. ఈరోజు ఉదయం స్వగృహానికి ఆయన మృతదేహం చేరగానే బంధుమిత్రుల శోకం మిన్నంటింది. ఈరోజు ఉదయం 11 గంటలకు విశాల్ అంత్యక్రియలు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలోని స్మశానవాటికలో జరగనున్నాయి.












Click it and Unblock the Notifications