భీమవరం: సత్యం సంస్థ మాజీ అధినేత రామలింగరాజుకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వివిధ మతాలకు చెందిన ప్రముఖులంతా కలిసి సోమవారం చేపట్టిన మౌనప్రదర్శన విజయవంతమైంది. భీమవరం పట్టణం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహించిన సభలో మాజీ మంత్రి మూర్తిరాజు తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. బైర్రాజు ఫౌండేషన్ ద్వారా తాగు నీరు ఉచితంగా పొందుతున్న గ్రామీణులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.