న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్(98) మంగళవారం ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వెంకట్రామన్ జనవరి 11న అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయనకు సైనిక ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వృద్ధాప్యం కారణంగా చికిత్సకు శరీరం స్పందించక, ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 1985 నుంచి 1990 వరకూరాష్ట్రపతిగా పనిచేేశారు.