చిరుపై కేశినాని నానీ నిప్పులు
విజయవాడ: కేశినేని నాని ప్రజారాజ్యం పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో చిరంజీవిపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. చిరంజీవి ఎన్నికల ద్వారా 2500 కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. చిరంజీవి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం ఓడినా, గెలిచినా చిరంజీవికి లాభమేనని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం కాదని కుటుంబ రాజ్యమని ఆయన అన్నారు. అది చిరంజీవి ఇష్టారాజ్యమని ఆయన అన్నారు.
ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి బంధుమిత్రులదని ఆయన అన్నారు. సామాజిక న్యాయాన్ని సాధిస్తానని అంటున్న చిరంజీవి కుటుంబంలో దాన్ని పాటించడం లేదని ఆయన విమర్శించారు. మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహమాడిన తన కూతురు శ్రీజను చిరంజీవి ఇంట్లోకి కూడా రానీయడం లేదని ఆయన అన్నారు. ఆర్ధిక బలం, పలుకుబడి అంతగా లేని విజయనిర్మలను కృష్ణాజిల్లా కన్వీనర్ ను చేయడం వల్లనే సమస్య తీవ్ర రూపం దాల్చింది. విజయనిర్మలకు పెద్దపీట వేయడం ఇష్టపడని నాని ప్రజారాజ్యం పార్టీపై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications