న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలు...రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఈరోజు అమెరికా నూతన అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకోనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ముఖేష్ భార్య నీతాతో కలిసి ఒబామాతో చర్చలు జరుపుతారు. ఔట్‌సోర్సింగ్‌ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ఒబామాతో అజీమ్ ప్రేమ్‌జీ భేటీపై ఆ రంగం ఆసక్తి చూపుతోంది.