మందుపాతరకు 12 మందికి గాయాలు
విశాఖపట్నం: ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లా పర్లాకిమిడి వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి సోమవారం 12 మంది పర్సనల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ) పోలీసులు గాయపడ్డారు. పర్లాకిమిడి సమీపంలోని ఆంధేరి గాటీ వద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్.పి.ఎస్.ఏ.ఖాన్ తెలిపారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో స్పెషల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సంఘటన ప్రాంతంలో మందుపాతర పేలుడుకు సంబంధించిన సామాగ్రి లభ్యమైనట్లు ఖాన్ తెలిపారు.












Click it and Unblock the Notifications