హైదరాబాద్: పాస్‌పోర్టు వివాదం కేసులో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ, ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేయాలని పోలీసు కమిషనర్‌ను నాంపల్లి కోర్టు ఆదేశించింది. నకిలీ దృవపత్రాలతో మధుయాష్కీ తన కుటుంబ సభ్యులను అమెరికాకు పంపారని కాంగ్రెస్ నేత గోనెప్రకాశ్ రావు చేసిన పిటీషన్‌పై ఈరోజు కోర్టు విచారించింది. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టవలసిందిగా పోలీసులను ఆదేశించింది.
మధుయాష్కి అక్రమాల మీద గోనె గోనెప్రకాశ్ రావు అనేకసార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. ఒకసారి మధుయాష్కి మనుషులు ప్రకాశరావు మీద దాడి చేశారు.