పీఆర్పీలో నవ తెలంగాణ విలీనం

దేవేందర్ గౌడ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం పార్టీకి ఇతోదికంగా ఉపయోగపడుతుందని, పార్టీ కూడా ఆయన సేవలను విస్తృతంగా వినియోగించుకుంటుందని చిరంజీవి తెలిపారు. ఇక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే సామాజిక న్యాయం అమలవుతుందనే ఆశతోనే తాము పార్టీ పెట్టామని, ప్రజారాజ్యం పార్టీ తమ ఆశయాన్నే ఎజెండాగా చేసుకుని ముందుకు సాగుతోందని అందుకే వారితో కలిసి సాగాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా దేవేందర్‌గౌడ్ అన్నారు. గౌడకు సముచిత స్థానం కల్పిస్తూ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. దేవేందర్ మార్గదర్శకంలో ప్రజారాజ్యం ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications