ఏప్రిల్ 16 న ఈ నియోజకవర్గాల్లో...

హైదరబాద్: ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 16న మొదటి దశలో తెలంగాణలో ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, హన్మకొండ, మిర్యాలగూడ, ఖమ్మం, మెదక్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, నల్గొండ, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, భువనగిరిలలో జరుగుతాయి.

అదేవిధంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, బొబ్బిలలో కూడా ఏప్రిల్‌ 16నే జరుగుతాయి. మార్చి 23 నుంచి తెలంగాణ, ఉత్తరాంధ్రలలో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ వేయాలి. మార్చి 30 నామినేషన్‌కు ఆఖరి తేదీ. నామినేషన్‌ విరమణకు చివరి తేదీ ఏప్రిల్‌ 2.

కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.వి. సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా పార్టీల ప్రచారంలో నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+