వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సంక్షేమ 'మంత్రం'

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu
హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యమిచ్చారు. సమాజంలో అసమానతలు పెరిగినకొద్దీ పేదలు, నిరుపేదల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతాయని అందుకే సామాజిక భద్రత వారికి కల్పించటం తాము ధ్యేయంగా పెట్టుకున్నామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో కమిటీ కసరత్తు చేసి రూపొందించిన అనేక విషయాలను ఆయన గురువారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయటమే తమ ఉద్దేశమని ఆయన వెల్లడించారు.

దీనికోసం పేద, మధ్య తరగతి కుటుంబాలకు సమగ్ర ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెడతామని, దీనికింద జ్వరంనుంచి గుండె జబ్బులవరకు ఉచిత చికిత్స అందిస్తామని ఆయన తెలిపారు. నిరుపేదలకు నెలకు 2వేల రూపాయలు, పేద, మధ్య తరగతి మహిళలకు నెలకు 1500 రూపాయలు, మధ్యతరగతికి నెలకు 1000 రూపాయలు భృతిగా అందజేయాలనే ఆలోచన ఉందని, దీనిపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. బెల్టుషాపులు పూర్తిగా తొలగిస్తామన్నారు. అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇంటికో కలర్‌ టీవీ ఇస్తామని ప్రకటించారు. దీనికయ్యే కరెంటు ఖర్చుకూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. వినోదపన్ను ఎత్తేస్తామని దీనివల్ల కేబుల్‌ ఆపరేటర్లు అంతా లాభపడతారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X