ఖబడ్ధార్ విజయశాంతి

Vijayashanti
హైదరాబాద్: ఖబడ్ధార్..విజయశాంతి..తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించరు. నీలాంటి వ్యక్తి బీజేపీని విమర్శఇస్తే మహిళా మోర్చా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. రాజకీయ వెలి వేయబోతున్నారు అంటూ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్ష్యురాలు వనం ఝాన్సీ నిప్పులు చెరిగారు. బీజీపీలో మహిళలకు సముచిత ప్రాధాన్యం లభించటం లేదన్న టీఆర్ ఎస్ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యలపై ఆమె విరుచుకు పడ్డారు.

సినిమాల్లో రిటైరై ఇంట్లో కూర్చుంటే రాజకీయాల్లోకి తీసుకువచ్చి గుర్తింపు తెచ్చిన బీజీపీ గురించి కన్నతల్లి రొమ్ము గుద్దే విధంగా విజయశాంతి మాట్లాడుతున్నారని ఆమ ధ్వజమెత్తారు. అసలు ఆమెది తెలంగాణా ప్రాంతమో కాదో తెలియని పరిస్దతని, ఆమె మాట,భాష,యాస, వేషం ఏదీ తెలంగాణకు సంబంధించినది కాదని ఆరోపించారు. రాజమండ్రికి వెళ్ళి అక్కడ పుట్టానని చెప్పిన విజయశాంతి మళ్ళీ తెలంగాణకు వచ్చి వరంగల్ లో పుట్టానని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇక ఇదే సభలో పాల్గొన్న బీజీపీ అధికార ప్రతినిధి సుష్మా స్వరాజ్ కూడా విజయశాంతి వ్యాఖ్యల్ని ఖండిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+