వైయస్ పై టీడీపీ కంప్లైంట్

ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో సచివాలయంలోని ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాల్లో, సమావేశపు హాలులో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు సాగించకూడదు. ప్రభుత్వ అతిథి గృహాలు, ఆలయాలు, పాఠశాలల్లో ఎలాంటి రాజకీయ ప్రచారం, సభలు నిర్వహించకూడదు. కాన్ఫరెన్సు హాలును ఎన్నికల ప్రచార వేదికగా ఉపయోగించుకోవడం ముమ్మాటికి నిబంధనలను ఉల్లంఘించడమేనని నిఘా వేదిక అభిప్రాయపడింది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.గత ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రితో సహా మంత్రులు నిబంధనల గీత దాటటంపై ఎన్నికల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు కావటంతో ముఖ్యమంత్రి హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications