టీడీపీలో చేరిన కేశినేని నాని
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీలో చేరి అనంతరం బయటకు వచ్చిన కేశినేని నాని సోమవారం ఉదయం టీడీపీలో చేరారు. భారీ ర్యాలీగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన ఆయన తన అనుచరులతో సహా పార్టీలో చేరారు. వారికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వాగతం పలికి పసుపుపచ్చ కండువాలు వేశారు. వారి చేరికతో కృష్ణా జిల్లాలో పార్టీ మరింత బలపడనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రముఖ ట్రావెల్స్ యజమాని అయిన కేసినేని నాని మొదట కొంత విరాళమిచ్చి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన విషయం మీడియా ద్వారా అందరికీ తెలుసు. అయితే తాను చేసుకున్న ఖర్చుకు తగిన విలువ చిరంజీవి పార్టీలో లభించడం లేదని అనుకున్న కేసినేని నాని తెలుగుదేశం పార్టీలో చేరడానికి నేడు ముహుర్తం నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications