వైయస్..దూకి చస్తావా?: కేసీఆర్

నల్లగొండ వాసులు చేసిన పాపం ఏమిటి, ఫ్లోరైడ్ బారినుంచి వారికి విముక్తి లేదా అన్నారు. పక్కనే కృష్ణా ఉన్నా..నది మొత్తాన్ని కడపకు మళ్లించి, నల్లగొండకు తెడ్డు చూపించారన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటికి వందల ఎకరాలు రాజధానిలో అప్పగించారన్నారు. కుత్బుల్లాపూర్‌లో తెరాస జెండా ఎగువేస్తామని ఆ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పోటీ చేస్తుందన్న కేసీఆర్ సంకేతాన్ని ఇచ్చారు.
2004లో వైఎస్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో రూ.30 లక్షల అప్పు ఉందని తెలిపారని, ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో రఘరాం సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లకు రూ.10 వేల కోట్లు ఆస్తులున్నట్లు చూపించారన్నారు. ఈ లెక్కలు చూస్తేనే మేత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు.అలాగే ఈసారి లక్ష మంది వైఎస్‌లు వచ్చినా తెలంగాణను ఆపలేరని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications