నేడే ప్రజారాజ్యం శంఖారావం
రాజమండ్రి: కోస్తా ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాఫ్తంగా సామాజిక వాణిని బలంగా వినిపించేందుకు రాజమండ్రిలో సామాజిక న్యాయ శంఖారావం పేరుతో ప్రజారాజ్యం నేడు భారీసదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యంగా బీసీలను పెద్ద ఎత్తున ఆకట్టుకొనేందుకే ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరు లక్షలమందికి పైగా ఈసదస్సుకు హజరుకానున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సామాజిక న్యాయ శంఖారావం అఖండజ్యోతిని పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ వెలిగించారు. అరవై సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సామాజిక న్యాయం ప్రజారాజ్యంతో సాధ్యంకానుందని అల్లు అరవింద్ చెబుతున్నారు. ఈనెల 12న మైనార్టీల ఆధ్వర్యంలో జల్సాయె సమాజ్ ఇన్సాఫ్ అనే సదస్సును పీఆర్పీ రాజధానిలో నిర్వహించనుంది. సభ అనంతరం రేపటినుంచి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పీఆర్పీ రోడ్ షోలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications