రాజమండ్రి: ప్రజారాజ్యం పార్టీ మంగళవారం సాయంత్రం రాజమండ్రిలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ శంఖారావం సదస్సుకు లక్షలాది మందిగా జనం తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటు తరువాత ఇక్కడ మొదటిసారి బహిరంగసభ జరగనుండటంతో భారీగా జనసమీకరణ చేస్తున్నారు. సభ అనంతరం రేపటినుంచి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పీఆర్పీ రోడ్ షోలు జరుగుతాయి.
సభకు వివిధ వాహనాల్లో జనం తరలి వస్తుండడంతో ఐదో నెంబరు జాతీయ రహదారి మీద ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు పది హేను కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.