మహాకూటమికి మహాషాక్
కరీంనగర్: మహాకూటమి తరపున స్థానికసంస్థల ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న భూంరావ్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నందున ఆయన దరఖాస్తు చెల్లదని తెలిపారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి భానుప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. దీనిపై తాను కోర్టుకు వెళతానని భూంరావు తెలిపారు. తెలుగుదేశం, టీఅర్ ఎస్, వామపక్షాలతో మహాకూటమి ఏర్పడిన తర్వాత ఇవే మొదటి ఎన్నికలు. కూటమికి ఆది లోనే చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.












Click it and Unblock the Notifications