వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవడబ్బ సొమ్ము: చిరు ప్రశ్న

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విజయవాడ: పేదలను, రైతులను మభ్యపెట్టి కాంగ్రెసు పెద్దలు ఐదేళ్ల పాటు వేల వేల కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారని, అది ఎవడబ్బ సొమ్మని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. కొద్ది కాలంలో వేల వేల కోట్లు సంపాదించడం ఎలాగో చెప్తే ప్రజలు కూడా నేర్చుకుంటారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కృష్ణా జిల్లాలో బుధవారం తన పర్యటనను కొనసాగిస్తూ బంటుమిల్లిలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాలను నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయమైందని ఆయన విమర్శించారు.

చిరంజీవికి రాజకీయం తెలియదని అంటున్నారని, రాజకీయమంటే వ్యసనం, వ్యాపారం అని తనపై వ్యాఖ్యలు చేస్తున్నవారి ఉద్దేశమని, అవే రాజకీయాలైతే ఆ రాజకీయాలు తనకు తెలియవని, ప్రజాసేవ చేయడమే రాజకీయమని మాత్రమే తనకు తెలుసునని ఆయన అన్నారు. ప్రజల కన్నీళ్లు, కడగగండ్లతో కాంగ్రెసు నాయకులు రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల పాటు సినీ నటుడిగా ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, తమకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారని ఆయన చెప్పుకున్నారు. ప్రజలతో తనకున్న అనుబంధం గుండెకూ గుండెకూ ఉన్న సంబంధమని ఆయన అన్నారు. ప్రజల ఆదరాభిమానాల పొందిన తాను ఎంతో పుణ్యం చేసుకున్నానని, ఇది తన జన్మఫల సుకృతమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X