రాఘవులు నామాలపై ఇసికి ఫిర్యాదు

BV Raghavulu
హైదరాబాద్‌: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులుపై చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పంగనామాలు పెట్టుకుని తిరిగాలని రోశయ్యనుద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైష్ణవులను కించపరిచేలా ఉన్నాయని, ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 125ను ఉల్లంఘించటమేనని ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై నగర పోలీస్‌ కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఓ మతానికి వ్యతిరేకంగా రాఘవులు వ్యాఖ్యలు చేయటం సబబుకాదన్నారు. 2007 ఆగస్టులో కూడా కమ్యూనిస్టు నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయగా తాము పోలీసు కేసు పెట్టామని, వారు క్షమాపణ చెప్పాక కేసు వెనుకకు తీసుకున్నామని సౌందరరాజన్‌ తెలిపారు. ఆ అనుభవం తర్వాత కూడా రాఘవులు ఇలాంటి విమర్శలు చేయటం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+