నాపై రాజకీయ కుట్ర: వరుణ్ గాంధీ

మైనారిటీలపై వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన బిజెపి నాయకత్వం మీడియాతో మాట్లాడవద్దని వరణ్ గాంధీని ఆదేశించినట్లు సమాచారం. హిందు సానుకూల వైఖరిని ఆయన సమర్థించుకున్నారు. తన విశ్వాసంపై తాను ఎవరికీ క్షమాపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, దానికి తాను గర్విస్తున్నానని, ప్రమాదంలో ఉన్న తన వర్గంలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నానని ఆయన వివరించారు. ఇతర వర్గాల పట్ల తనకు చెడు అభిప్రాయమేమీ లేదని ఆయన చెప్పారు. హిందువును, భారతీయుడిని, గాంధీని అయినందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు.
మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు వివరణ ఇవ్వాలని ఎన్నికల కమీషన్ వరణ్ గాంధీని ఆదేశించింది. ఆ వివరణకు సంతొప్తి చెందని కమిషన్ వరణ్ గాంధీపై కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ లోని ఫిలబిత్ పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications