కడప: పవన్ కళ్యాణ్ యువరాజ్యం పేరుపై సివిల్ కేసు దాఖలైంది. "ఇది వరకే మేం నమోదు చేసుకున్న యువరాజ్యం పేరును ప్రరాపా అక్రమంగా వాడుకుంటోంది. ఈ విషయమై లీగల్ నోటీసుకు ఆ పార్టీ వ్యవస్థాపకులు స్పందించలేదు. కనుక చిరంజీవి, యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్, జిల్లా కన్వీనర్ రమణారెడ్డిపై ఈ నెల 20న కడప జిల్లా కోర్టులో కేసు(17/2009) నమోదు చేశాం." అని యువరాజ్యం సేవాసమితి అధ్యక్షుడు రాంప్రసాద్ తెలిపారు. తమ సమితిని ఇప్పుడు అందరూ పవన్ కల్యాణ్‌కు చెందినదిగానే గుర్తిస్తున్నారని దీని వలన తమ సేవలకు ఆటంకం కలుగున్నట్లు పేర్కొన్నారు.