వందకే వంట పథకంపై మొదటి సంతకం: చిరు
కాకినాడ: తాము మొదటినుంచి చెబుతున్నట్లు టిక్కెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. దాదాపు యాభై శాతం టికెట్లను బీసీలకు చిరంజీవి మొదటి జాబితాలో కేటాయించిన విషయం తెలిసిందే. రెండవ జాబితాలో మహిళకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం వందరూపాయలకే వంటసరుకు పథకం ఫైలుపైనే పెడతామని అన్నారు. అల్లు అరవింద్ అనకాపల్లినుంచి పోటీచేస్తారని చిరు తెలిపారు. టిక్కెట్లు రానివారికి అసంతృప్తి సహజమని ఆయన అన్నారు. అయితే అందరికీ ఇవ్వలేమని, ఆ విషయాన్ని గుర్తించి కష్టపడి పనిచేస్తే తప్పక భవిష్యత్తులో అవకాశం వస్తుందని చిరంజీవి అన్నారు.












Click it and Unblock the Notifications