పూర్వ జన్మ చిత్రం "మగధీర"
రామ్ చరణ్ తేజ్ రెండో చిత్రంతో సంచలనం సృష్టించడానికి సమాయత్తమవుతున్నారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 37కోట్ల వ్యయంతో అత్యంత భారీ చిత్రంగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న మగధీర' చిత్రాన్ని సూపర్ సక్సెస్‌ఫుల్(యస్.యస్) దర్శకుడు రాజమౌళి తన పంథాలో వినూత్నంగా రూపొందిస్తున్నారు. అతి త్వరలో మగధీర'గా సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్న కథానాయకుడు రామ్ చరణ్ తేజ్‌కు జోడీగా చందమామ' ఫేం కాజల్ అగర్వాల్ నటిస్తోంది. 400సంవత్సరాల క్రితం విడిపోయిన ప్రేమికులు ఈ జన్మలో ఎలా కలిసారన్న దానిని దర్శకుడు రాజమౌళి అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. రాజస్థాన్ నేపథ్యంలో జరిగే ఈ ప్రేమకథలో రామ్‌చరణ్ తేజ్ వివిధ గెటప్‌లలో కనిపించి అభిమానులను అలరించనున్నారు. ఇందులో డా. శ్రీహరి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీహరి- రామ్‌చరణ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరించే విధంగా దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో షెడ్యూలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది.












Click it and Unblock the Notifications