మెదక్ సీటు దక్కించుకున్న విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి జాబితాలో శనివారం సాయంత్రం కొన్ని మార్పులు జరిగాయి. తాజా జాబితా ప్రకారం మహబూబ్ నగర్ నుంచి కెసీఅర్, మెదక్ లోక్ సభ స్ధానం నుంచి విజయశాంతి పోటీ చేస్తారు. మొదట మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సినీనటి విజయశాంతి అభ్యర్థిత్వం ఖరారయ్యింది. అయితే విజయశాంతి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదని తెలిసింది. విజయశాంతికి కెసీఅర్ మొదట మల్కాజిగిరి లోక్ సభ స్ధానం ఇవ్వబోయారు. అందుకు ఆమె అంగీకరించ లేదు. మెదక్\ లేదా భువనగిరి లోక్ సభ టికెట్ట్టు కావాలని విజయశాంతి పట్టుబట్టినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications