పోలీసు క్యాంపుపై దాడి: 8 మంది మృతి
లాహోర్: పాకిస్తాన్ లో మరో ఉగ్రవాద దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం లాహోర్ సమీపంలోని మానావాతఫ పోలీసు శిక్షణా కేంద్రంపై దాడి చేశారు. ఎనిమిది పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఈ దాడిలో 8 మంది పోలీసులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
మీడియా కథనాల ప్రకారం - ఉగ్రవాదుల గుంపు ఒకటి సోమవారం ఉదయం శిక్షణా కేంద్రంపై దాడి చేసింది. గ్రేనెడ్లు విసురుతూ ఉగ్రవాదులు కేంద్రంలోకి ప్రవేశించారు. కొంత మంది పోలీసులను బందీలుగా తీసికెళ్లినట్లు కూడా తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో 70 మంది పోలీసులు క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదులకు, పోలీసులనకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications