ఒరిస్సా తుఫాను : 14 మంది మృతి
ఓరిస్సా: కేంద్ర పార జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ తుఫాను తాకిడికి సుమారు 11 గ్రామాలు దెబ్బతిన్నాయి. వందలాది మందికి గాయాలయ్యాయి. భారీగా వీచిన గాలులకు చెట్లు, విద్యుత్ స్థంబాలు విరిగి పడటంతో రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. కరెంటు లేక గ్రామాలు చీకట్లో మగ్గాయి. తుఫాను తాకిడికి గురయిన క్షతగాత్రులను అసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల ఎఎక్స్ గ్రేషియా ప్రకటించింది.












Click it and Unblock the Notifications