హైదరాబాదు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం కుటుంబసమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు . ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరుని పాదాలవద్ద టీడీపీ మేనిఫెస్టోకు బాబు పూజ చేయించారు. వెంకన్న దర్శనం అనంతరం ఈ రోజు సాయంత్రం హైదరాబాదులో సీపీఎం నేతలతో సమావేశం కానున్నారు. కుప్పంలో నామినేషన్ వేసిన చంద్రబాబు రేపు తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలాగే చిత్తూరు జిల్లాపై అక్కడి నాయకులతో బాబు సమీక్ష నిర్వహించనున్నారు.