భద్రాచలం: శ్రీరామ నవమి పుణ్య దినాన్ని పురస్కరించుకుని భద్రాచలం మొత్తం రామనామ సంకీర్తనతో మారుమ్రోగుతోంది. వైష్ఠవ సంప్రదాయం ప్రకారం అభిజిత్ లగ్నంలో శనివారం అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎక్కెడెక్కడి రామభక్తులు వచ్చి ఆ కళ్యాణ ఘడియలని కళ్ళారా చూడటానికి ఉద్యుక్తులవుతున్నారు. మరో ప్రక్క కోదండ రాముడు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాడు. ఎండలు మండుతున్నా లెక్కచేయకుండా రామయ్య పెళ్లిని తిలకించేందుకు భక్తకోటి ఇక్కడికి చేరుకుంటోంది. గౌతమి గోదావరి నదిలు అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పుణ్యస్నాణాలతో, సీతారామచంద్రస్వామి దర్శనభాగ్యంతో భక్తులకు మైమరిచిపోతున్నారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ తో మిథిలా స్టేడియం అద్బుతమై మెరిసిపోతోంది.శుభమస్తు..అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.