పాక్ లో అమెరికా ఎంబసీ మూసివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధికార యంత్రాంగం అప్రమత్తం చేయడంతో ఆ దేశంలోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని శుక్రవారం మూసేశారు. ఇస్లామాబాద్ లో ఉగ్రవాదుల దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు పాకిస్తాన్ అధికారులు హెచ్చరించారు. అమెరికన్లు దౌత్య కార్యాలయం అధికారులు అత్యవసరమైన కాన్సులర్ సర్వీసులను మాత్రం అందిస్తున్నారు. తిరిగి దౌత్య కార్యాలయం సోమవారం పని చేయడం ప్రారంభిస్తుంది.
లాహోర్, కరాచీ, పెషావర్ ల్లోని దౌత్య కార్యాలయాలు శుక్రవారం పని చేస్తున్నాయని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. భద్రతకు సంబంధించిన విషయాలు వెల్లడించడానికి ఆ ప్రతినిధి నిరాకరించారు. బహిరంగ ప్రదేశాల్లో, రెస్టారెంట్లలో, హోటళ్లలో జాగ్రత్తగా ఉండాలని దౌత్య కార్యాలయం తన సిబ్బందిని హెచ్చరించింది. గుడ్ ఫ్రైడే సందర్భంగా దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు వార్తలు రావడంతో పలు అంతర్జాతీయ కార్యాలయాలు మూత పడ్డాయి.












Click it and Unblock the Notifications