చిరు ప్రజా రైలు యాత్ర షురూ
హైదరాబాద్: ప్రజలకు తమ గుర్తును చేరువ చేసేందుకు ప్రజారాజ్యం పార్టీ చేపట్టిన రైలు యాత్ర ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి శనివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జెండా వూపి దీన్ని ప్రారంభించారు. సినీ నటులు అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ ఆయనతో పాటు పాల్గొని అభిమానులను ఉత్సాహపరిచారు. రైలు యాత్ర వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా సాగే ఈ రైలు యాత్ర తిరుపతి వరకు సాగుతుంది. మూడురోజులపాటు ఈ యాత్ర సాగుతుంది.
చిరంజీవి మీడియానుద్దేశించి మాట్లాడారు. అలాగే రామ్ చరణ్ తేజా, అల్లు అర్జున్ అభిమానుల వైపు చేతులు ఊపుతూ వారిని సంతోషపెట్టారు. రైలింజన్ కు ఓటేయాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications