తండ్రికి చిరుకు అండగానే...: రామ్ చరణ్

హైదరాబాద్: తన తండ్రికి అండగా ఉండడమే తన ఉద్దేశ్యమని సినీ హీరో, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా అన్నారు. తన తండ్రికి తన ప్రచారం అవసరం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజారాజ్యం ప్రజా రైలు యాత్రలో చిరంజీవి, అల్లు అర్జున్ లతో పాటు ఆయన పాల్గొంటున్నారు. ఈ యాత్రను చిరంజీవి శనివారం ఉదయం సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లో ప్రారంభించారు. తమ రైలింజన్ స్పీడ్ పెరుగుతుందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని చిరంజీవి ఈ సందర్భంగా అన్నారు. సమాజానికంతటికీ తమ రైలు మేలు చేస్తుందని ఆయన చెప్పారు.

సామాజిక న్యాయానికి తమ రైలు ప్రతీక అని, ఇది సామాజిక న్యాయ సాధన రైలు అని ఆయన అన్నారు. ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రజలందరికీ మేలు చేస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ అవసరం ప్రజలందరికీ ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+