విదేశీయురాలిపై అసభ్య ప్రవర్తన: ఆందోళన
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్ వద్ద ఆదివారం అర్థరాత్రి విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హోటల్లో ఓ వ్యక్తి విదేశీయురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని దాన్ని అడ్డుకున్న తమను హోటల్ సిబ్బంది చితకబాదారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. హోటల్‌పై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జి చేశారు.
ఘర్షణలో ఎస్‌ఐ చేతికి గాయమైంది. క్షమాపణలు చెప్పాలని పోలీసులను డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications