కరీంనగర్: కాంగ్రెసు పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ నటుడు బాలకృష్ణ దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు.
తాను అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ఆయన వివరించారు. కలర్ టీవీ పంపిణీ వల్ల ప్రజలకు విజ్ఞానం, వినోదం, వికాసం కలుగుతాయని ఆయన చెప్పారు. నగదు బదిలీ పథకం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన చెప్పారు.