జూ.ఎన్టీఆర్ కే సాధ్యం: రాజీవ్ కనకాల

Rajiv Kanakala
హైదరాబాద్: తీవ్రంగా గాయపడి కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఉద్వేగంగా మాట్లాడారని, అది ఆయనకే సాధ్యమని ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సోమవారం సాయంత్రం టీవీ మీడియాలో ప్రసంగించిన తీరుపై ఆయన మంగళవారం ప్రశంసల జల్లు కురిపించారు. తనకు జూనియర్ ఎన్టీఆర్ మంచి మిత్రుడని, అందుకే తరుచూ కలుస్తుంటానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తన సందేశాన్ని ప్రజల్లోకి జూనియర్ ఎన్టీఆర్ చాలా సమర్థంగా తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. తాను జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మిత్రుడిని మాత్రమేనని రాజకీయమైన ప్రశ్నలు తనను అడగవద్దని ఆయన మీడియా ప్రతినిధులను కోరుకున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజీవ్ కనకాల కూడా ఉన్న విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కూడా గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+