బీహార్ లో దాడి: 12 మంది నక్సల్ హతం
పాట్నా: తొలి విడత పోలింగ్ జరగడానికి ఒక రోజు ముందుగా మావోయిస్టులు బీహార్ లో బిఎస్ ఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఈ మెరుపుదాడిని బిఎస్ ఎఫ్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. మావోయిస్టులకు, బిఎస్ ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ససరాంలో జరిగింది.
ససరాంలోని బిఎస్ ఎఫ్ క్యాంపుపై దాదాపు వంద మంది నక్సలైట్లు మెరుపుదాడి జరిపారు. ఆ సమయంలో క్యాంపులో 80 మంది దాకా జవాన్లు ఉన్నట్లు సమాచారం. ససరాం నియోజకవర్గంలో గురువారం పోలింగ్ జరుగుతోంది. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఇక్కడ ముఖాముఖి పోటీ నెలకొని ఉంది.ఈ నియోజకవర్గంలో కాంగ్రెసు తరఫున సిట్టింగ్ పార్లమెంటు సభ్యురాలు, సామాజిక న్యాయ శాఖ మంత్రి మీరా కుమార్, బిజెపి తరఫున మున్నీలాల్ పోటీ పడుతున్నారు. నక్సల్స్ దాడిలో ఒక బిఎస్ఎఫ్ జవాను గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications