నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఓట్లకోసమే ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విమర్శించారు. శనివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు, వైఎస్ అవినీతి నాణానికి రెండు ముఖాలు లాంటివారని చిరు విమర్శించారు. అవినీతిలో బాబు కిటికీలు తెరిస్తే, వైఎస్ ద్వారాలు తెరిచారని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వందరూపాయలకే వంట సరుకు పథకంపై తొలి సంతకం చేస్తామని చిరు మరోసారి స్పష్టం చేశారు. సీట్లు అమ్మకం వార్తను హైలెట్ చేయడంలో ప్రత్యర్థులు బాగా సక్సెస్ అయ్యారని చెప్పారు. నిశ్శబ్ద ఓటింగ్‌లోనే ప్రజారాజ్యం పార్టీ విజయం సాధిస్తుందని చిరు ధీమా వ్యక్తం చేశారు.