వైఎస్ దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాసంఘాల నాయకులు ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణలో ఓటమి భయంతోనే రెండో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల ప్రజలకు ఆకట్టుకొనేందుకు వైఎస్ నీతిమాలిన మాటలు మాట్లాడుతూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దీనిపై ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ వ్యాఖ్యలపై తెలంగాణ విద్యావంతుల వేదిక ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications