హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో గల పోస్టాఫీసుల్లో ఇకనుంచి నానో కార్లు బుక్ చేసుకోవచ్చు. ప్రధాన పట్టణాల్లోని హెడ్ పోస్టాఫీసుల్లో నేటినుంచి దరఖాస్తుల విక్రయం, స్వీకరణ జరగనున్నాయి. ఈ మేరకు టాటా మోటార్స్ పోస్టల్‌శాఖతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అదే పోస్టాఫీసుల్లో రుణ దరఖాస్తులు కూడా అందజేయవచ్చని టాటా కంపెనీ తెలిపింది.
రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, నెల్లూరు, భీమవరం, విజయవాడ, విశాఖపట్టణం, కడప, గుంటూరు, ఖమ్మం, కర్నూలు, నిజామాబాద్, రాజమండ్రి, వరంగల్ పట్టణాల్లో ఈ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.