కాల్పుల విరమణ జోక్: శ్రీలంక

కొలంబో: ఎల్టీటిఇ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే ఈ విరమణను శ్రీలంక ప్రభుత్వం జోక్ గా అభివర్ణించింది. ఏకపక్షంగా ఎల్టీటిఇ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. సాధారణ ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణను ప్రకటించినట్లు ఎల్టీటిఇ తెలియజేసింది. సంధి మాత్రమే సమస్యకు పరిష్కారమని టైగర్లు పేర్కొన్నారు. అమాయక ప్రజలు చనిపోకూడదనేదే తమ అభిమతమని ప్రకటించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్పందించేలా చేస్తామని టైగర్లు ప్రకటించారు.

శ్రీలంక ప్రభుత్వం మాత్రం కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 'లొంగిపోవాల్సిందే. లేదంటే ఏరి పారేస్తాం. మరోసారి మోసగించేందుకు టైగర్లు కుయుక్తి పన్నారు. బలాన్ని కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో కాల్పుల విరమణ మాటే ఉండదు' అని శ్రీలంక రక్షణ కార్యదర్శి గోతబయ రాజపక్సే స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+