హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కేసులో నిందితులైన రామలింగరాజు సోదరులు, మాజీ సీఎఫ్‌ఓ శ్రీనివాస్‌లకు నాంపల్లి కోర్టు మే 13 వరకు జ్యుడీషియల రిమాండ్ విధించింది. వారిని సీబీఐ అధికారులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం వారిని తమ కస్టడీలోకి తీసుకున్న సిబిఐ వారిని ప్రశ్నించింది. గడువు ముగియడంతో వారిని సిబిఐ బుధవారం కోర్టులో హాజరు పరిచింది. కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌ను మే 4న నిందితులకు అందజేస్తామని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.