భారత్ లోకి ముగ్గురు స్వైన్ ప్లూ రోగులు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులు చికాగో నుంచి రాగా, ఒకరు లండన్ నుంచి వచ్చారు. వీరు ముగ్గురు కూడా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.
ఇందిరా గాంధీ విమానాశ్రయంలోని వైద్యులు చికాగో నుంచి వచ్చిన పరంజిత్ కౌర్, జగ్జీవన్ సింగ్ లను శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపించారు. వీరు పంజాబ్ లోని ఫతేబాద్ కు చెందినవారు. లండన్ నుంచి బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో వచ్చిన అశ్వినిని శనివారం ఉదయం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపారు.శుక్రవారం సాయంత్రం నుంచి స్వైన్ ఫ్లూ వ్యాధి వచ్చిందనే అనుమానంతో ఐదుగురిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications