లా పరీక్షలు రాస్తున్న మహంతి
హైదరాబాద్: రాష్ట్ర డిజిపి మహంతికి న్యాయవాద వృత్తిపై మక్కువ ఏర్పడింది. ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో మహంతి అందరి ప్రశంసలు అందుకునన్నారు. ఎన్నికలు కాగానే విశ్రాంతి తీసుకోకుండా లా పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాదులోని అమీర్ పేటలో గల పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఆయన ఎల్‌ఎల్‌బీ చదువుతున్నారు. శనివారం నుంచి ఆయన అక్కడ సెకండ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరవుతున్నారు. దీనికోసమే ఆయన సెలవు కూడా పెట్టారు. ఉదయం 10 గంటలకు కాలేజీకి వచ్చి పరీక్ష రాశారు. క్షణం తీరికలేకుండా ఉండే ఆయనకు అంత సమయం ఎక్కడిదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.












Click it and Unblock the Notifications