విజయవాడ: లగడపాటి రాజగోపాల్ తన విజయంపై రూ.100 కోట్లకు బహిరంగంగా బెట్టింగ్ కాశారని మైలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సుంకర కృష్ణమూర్తి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. ఆ పిర్యాదులో పశ్చిమ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లికా బేగం గెలుస్తారని రాజగోపాల్ బెట్టింగ్ కాశారని పేర్కొన్నారు. అలాగే ఆ బెట్టింగ్ విజయవాడ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌లో జరిగిందన్నారు. ఈ విషయమై విజయవాడలోని గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశానని చెప్పారి. అయినా తనకు అక్కడ న్యాయం జరిగే అవకాశం లేదని భావిస్తున్నానని అందుకే ఇలా కంప్లైంటు చేస్తున్నానని ఇ.సి.కి ఆయన వివరించారు.