నా రాష్ట్రానికి జబ్బు చేసిందా?చిరు
విశాఖ : ప్రజల ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే రాష్ట్రం మొత్తానికి జబ్బు చేసిందా అన్నట్లుగా ఉందని ప్రజారాజ్యం అధినేత చిరింజీవి అన్నారు. జ్వరాలు, ఆంత్రాక్స్ బారినపడి వేలాదిమంది గిరిజనులు చనిపోతున్న.. ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. పరిస్థితులు చక్కదిద్దడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. విశాఖ మన్యంలో ఒకరోజు పర్యటన ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏజెన్సీలో దయనీయంగా మారిన గిరిపుత్రుల ఆరోగ్యపరిస్థితి మెరుగుపరచడానికంటే వైఎస్ సర్కార్ రాజకీయ లబ్దికీ, ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకం సంజీవనీ కాదు.. సర్వరోగ నివారణికాదని ఆయన ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపరచడానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications