న్యూఢిల్లీ: పంజాబ్ లో ఎన్డీయె తరఫున ప్రచారం చేయడానికి తెలంగాణ రాష్టర్ సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అంగీకరించారు. ప్రచారానికి రావాల్సిందిగా కెసిఆర్ ను పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ ఆహ్వానించారు. దీనికి కెసిఆర్ అంగీకరించారు.
సోమవారం నుంచి ఆయన పంజాబ్ లో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ఆదివారం లూథియానాలో జరిగే ర్యాలీకి బిజెపి నేతలు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి కేంద్రంలో ఎన్డీయెకు కెసిఆర్ దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.