కార్లపై పైకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్: హైదరాబాద్ లోని వనస్థలిపురం పనామా గిడ్డంగి వద్ద సోమవారం ఉదయం ఆర్టీసి బస్సు కార్లపైకి దూసుకెళ్లింది. అది ఎనిమిది కార్లపైకి దూసుకుపోయింది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలియవచ్చింది. బస్సు ఎన్జీవో కాలనీ వస్తుండగా ఈ సంఘటన సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications