కోల్ కత్తాలో ఘర్షణ: ఒకరి మృతి
న్యూఢిల్లీ: తుది విడత పోలింగ్ సందర్భంగా అధికార సిపిఎం, తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తల మధ్య బుధవారం ఉదయం జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మరణించాడు. కోల్ కత్తా శివారులోని బలిగురిలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
ఘర్షణల సందర్భంగా నాటు బాంబు తాకి 21 ఏళ్ల సామినూల్ హక్ అనే యువకుడు గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గమధ్యంలోనే మృత్యువాత పడ్డాడు. ఈ ప్రాంతం బరసాత్ నియోజకవర్గంలో పరిధిలోకి వస్తుంది. గట్టి భద్రత మధ్య ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications